Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టులో భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరగా.. హైకోర్టు తిరస్కరించింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2019లో మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ కామెంట్స్ చేయగా.. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. అనంతరం రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం కూడా రద్దు అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ అప్పట్లో దూమారం చెలరేగగా.. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ గాంధీ ప్రకటన మొత్తం మోడీ వర్గాన్ని కించపరిచేలా ఉందని.. మోడీ వర్గం పరువు తీశారంటూ సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు.. దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.  


ఈ తీర్పును రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. రాహుల్ గాంధీపై 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించడం అన్యాయం అని చెప్పలేమని తెలిపింది. దిగువ కోర్టు ఆదేశాలతో జోక్యం చేసుకోవడంలో తమకు ఎలాంటి సమర్థన కనిపించడం లేదని తీర్పు వెల్లడించింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. గుజరాత్ హైకోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 


Also Read: TS Inter Supplementary Results: నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి  


Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి