TS Inter Supplementary Results: నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

TS Inter Supply Results Check on tsbie.cgg.gov.in: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 7, 2023, 09:40 AM IST
TS Inter Supplementary Results: నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

TS Inter Supply Results Check on tsbie.cgg.gov.in: విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదల చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలిపింది. ఫస్టియర్, సెకండియర్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో  ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,12,325 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,70,583 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 1,41,742 మంది విద్యార్థులు సెకండీయర్ పరీక్షలకు హాజ‌ర‌య్యారు.

దోస్త్‌, ఇంజ‌నీరింగ్, ఇత‌ర‌ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు అధికారులు రెడీ అయ్యారు. విద్యార్థులు రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబరును ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

==> TSBIE అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించండి.
==> హోమ్‌పేజీలో టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
==> హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> ఇంటర్ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
==> ఫలితాలను చెక్ చేసుకుని.. భవిష్యత్ అవసరాల కోసం పీడీఎఫ్ కాపీని భద్రపరుచుకోండి. 

ఇక ఈ ఏడాది జ‌రిగిన ఇంట‌ర్మీడియల్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల ఫలితాల్లో 63.85 శాతం మంది ఫస్టియర్ విద్యార్థులు, 67.26 శాతం మంది సెకండీయర్ విద్యార్థులు పాస్ అయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 54.66 శాతం ఉత్తీర్ణులవ్వగా.. బాలికలు 68.68 శాతం పాస్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం బాలురు 55.60 శాతం పాస్ అయితే.. బాలికలు 71.57 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,48,153 మంది ఇంటర్‌ పరీక్షలను రాశారు. 

Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై  

Also Read: ట్విస్ట్ అదిరింది.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x