అమేథి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. యూపిఏ చైర్‌పర్సన్ రాయ్‌బరేలి ఎంపీ సోనియా గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సమక్షంలో అమేథి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాహుల్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. దశాబ్ధాల తరబడిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఎప్పటికప్పుడు ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేతలు అమేథి నుంచి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికన్నా ముందుగా ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి భారీ ర్యాలిగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ప్రియాంకా గాంధీ వాద్రా కుమారుడు రైహాన్, కూతురు మిరయ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.