వయనాడ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి లోక్ సభ నియోజకవర్గం ఆయన మొదటి ప్రాధాన్యత కలిగిన లోక్ సభ స్థానం కాగా వయనాడ్ ఆయన పోటీచేస్తోన్న రెండో లోక్ సభ స్థానం. కాంగ్రెస్ పార్టీకి అమేథి, వయనాడ్ రెండూ కంచుకోట లాంటి స్థానాలే కావడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177798","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయడం కోసం నిన్ననే కొజికోడ్ వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇవాళ ఉదయం హెలీక్యాప్టర్ ద్వారా వయనాడ్‌కి వెళ్లారు. రాహుల్ సోదరి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఆ సమయంలో రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నింతల వయనాడ్‌లో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.