Rahul Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ తన ఎంపీ సభ్యత్వం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి త్యాగం చేసిన లోక్‌సభ స్థానాన్ని రాహుల్‌ గాంధీ ఉంచుకుని.. దక్షిణ భారతదేశంలో గెలిచిన సీటును వదులుకున్నాడు. రాయ్‌బరేలీ ఎంపీగా తాను కొనసాగుతానని ప్రకటించారు. అయితే తాను వదులుకున్న స్థానం నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వెల్లడించారు. అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించడంతో దక్షిణ భారతదేశాన్ని గాంధీ కుటుంబం వదిలేసిందనే అపవాదు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Electricity Bill: మీరు కరెంట్ బిల్లులు కట్టరా? మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం


 


లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తమ కంచుకోట అయిన రాయ్‌ బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేసి నెగ్గారు. అంతేకాకుండా కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక స్థానాన్ని విధిగా వదులుకోవాల్సి రావడంతో ఏ స్థానాన్ని వదిలేసుకోవాలనే విషయమై మల్లగుల్లాలు పడ్డారు. సుదీర్ఘ మంతనాల తర్వాత ఎట్టకేలకు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తమ పార్టీ.. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని అనంతరం బయటకు వచ్చి వెల్లడించారు.

Also Read: Kangana Ranaut: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జీతమెంతో తెలుసా? నెలకు ఆమె సంపాదన ఇంత భారీగానా?


 


ఆలోచించా..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'వయనాడ్‌తో నా బంధం కొనసాగుతుంది. రెండింటిలో దేనిని వదులుకోవాలనే విషయంలో చాలా ఆలోచించా. వయనాడ్‌ను వదులుకుంటున్నా. కానీ వయనాడ్‌ను తరచూ సందర్శిస్తూ ఉంటా. అక్కడి నుంచి నా సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారు' అని రాహుల్ ప్రకటించారు. కాగా 2019 ఎన్నికల్లో కూడా రాహుల్ రెండు చోట్ల పోటీ చేశారు. యూపీలోని ఆమేఠిలో పోటీ చేసి ఓడిపోగా.. వయనాడ్‌ ప్రజలు ఆదరించడంతో ఎంపీగా రాహుల్‌ కొనసాగారు. మరోసారి వయనాడ్‌ నుంచి గెలిచినా కూడా రాహుల్‌ వదులుకున్నారు. అయితే రాహుల్‌ వెళ్లినా ఆయన సోదరి ప్రియాంకను పోటీలోకి దింపడం కాంగ్రెస్‌ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter