Rahul Gandhi No Entry: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. రాహుల్ గాంధీకి చేదు అనుభవం
Rahul Gandhi Nyay Jodo Yatra: దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సంబరాలు జరుగుతుండగా అస్సాంలో మాత్రం తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వేళ ఓ ఆలయానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లగా అక్కడి నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లనివ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనికితోడు అడుగడుగునా యాత్రకు ఆటంకం కలిగించడంతో అస్సాంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
Denied Temple Entry to Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అస్సాంలోని 17 జిల్లాల మీదుగా రాహుల్ పర్యటన కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నగావ్ జిల్లాలో సోమవారం రాహుల్ పర్యటించారు. ఆ జిల్లాలోని ప్రముఖ బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ వెళ్లారు. ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్‌ను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లోకి వెళ్లకుండా ఆయనను, ఆయన అనుచరులను అడ్డగించారు. పోలీసులు వారిని నిలువరించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. 'దేవాలయంలోకి రాకుండా నన్ను అడ్డుకున్నారు. నన్ను అడ్డుకోవటానికి గల కారణం ఏమిటని అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా' అని తెలిపారు. దేవాలయంలోకి ఎవరూ ప్రవేశించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాను ఆలయాన్ని దర్శించుకోలేనంత తప్పు ఏం చేశానని ప్రశ్నించారు. ప్రార్థనలు చేయడానికి బతద్రవ సత్ర ఆలయానికి వచ్చానని, గొడవలు సృష్టించడానికి కాదని రాహుల్ హితవు పలికారు. కాగా రాహుల్ గాంధీ నిర్వహించాల్సిన కార్నర్ స్ట్రీట్ సమావేశానికి కూడా పోలీసులు నిరాకరించారు. శాంతిభద్రతల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 'ఒకేరోజు జరుగుతున్న రెండు ప్రధాన కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొందరు దుండగులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు వెల్లడించాయి. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యతతో పాటు రాహుల్ గాంధీ భద్రతా దృష్ట్యా నిరాకరించాం' అని అస్సాం పోలీస్ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఆంక్షలు విధించినట్లు తెలిపారు. జోడో యాత్ర మార్గం పునరాలోచించుకోవాలని రాహుల్‌కు ఆయన కోరారు. కాగా, రాహుల్‌ను అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో శాంతియుతంగా జరుగుతున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ గూండాలు చేసిన దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
బీజేపీ పోకిరి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. దీనికి వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం 6:00 గంటలకు అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి నిరసన ప్రదర్శన, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook