వారి ఖాతాల్లోకి డబ్బులు చేరాలి.. ఆర్ధిక ప్యాకేజీపై ప్రధాని పునరాలోచించాలి... రాహుల్ గాంధీ
దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలని కోరారు. భారత్ మొత్తం వలస కూలీలకు అండగా ఉందనే సందేశం చేరవేయాలన్నారు. లక్షల మంది వలస కూలీలు కాలినడకన తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారని తెలిపారు.
Also Read: Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం..
వలసకార్మికులకు ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు వహిస్తూ లాక్ డౌన్ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని, పేద ప్రజలు డబ్బులు లేకపోతే ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని, పేద ప్రజల ఖాతాలోకి డబ్బులు నేరుగా చేరే విధంగా చూడాలన్నారు. ఆర్థిక ప్యాకేజీ విషయంలో ప్రధాని Narendra Modi పునరాలోచించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వలస కూలీలు, ప్రజలకు న్యాయం చేసి వారిని ఆదుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..