PM Modi speech highlights : ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు

కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

Last Updated : May 12, 2020, 10:23 PM IST
PM Modi speech highlights : ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు

న్యూ ఢిల్లీ: కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్‌పై యుద్ధానికి గాను భారతావనికి రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ ఆర్థిక సహాయం వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరిస్తారని తెలిపారు. ఈసారి విధించబోయే లాక్ డౌన్‌లో కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ఉంటాయని.. ఆ వివరాలను మే 18కి ముందు ప్రకటించడం జరుగుతుందని ప్రధాని అన్నారు. 

కరోనావైరస్ గురించే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవద్దు. మనిషికి మనిషికి మధ్య 2 గజాల దూరం ( Social distancing ) పాటించాలి. కరోనాతో పోరాటం చేస్తూనే జీవితంలో ముందడుగేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

లోకల్ వ్యాపారులను, స్థానికంగా ఉండే చిరు వ్యాపారులను ప్రోత్సహించేలా స్థానికుల వద్దే కొనుగోలు చేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌గా చలామణి అవుతున్న వాళ్లంతా ఒకప్పుడు లోకల్ స్థాయిలో వ్యాపారం చేసిన వాళ్లేనని గుర్తుంచుకోవాలంటూ స్వదేశీ ఉత్పత్తులు, తయారీదారులనే ప్రోత్సహించాలని ప్రధాని మోదీ చెప్పకనే చెప్పేశారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ఇంకొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • గత 4 నెలలుగా యావత్ ప్రపంచం కరోనావైరస్‌తో పోరాడుతోంది. ఈ నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలకుపైగా జనం కరోనా బారిన పడగా.. 2.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.
  • మానవాళిని కాపాడుకునేందుకు యావత్ ప్రపంచం ఏకమై ఆ వైరస్‌పై ఒక యుద్ధమే చేస్తోంది.
  • కరోనావైరస్‌పై ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తుండగా.. భారత్ ప్రపంచ దేశాలకు మెడిసిన్స్ పంపిస్తోంది. భారత్ ఏదైనా చేయగలదని.. భారత్ మాత్రమే ఇప్పుడు తమకు సాయం చేయగలదని యావత్ ప్రపంచం విశ్వసిస్తోంది. 
  • కరోనావైరస్ సంక్షోభంతో ప్రపంచం మొత్తం ఇబ్బందిపడుతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఒంటరిగానే ఈ మహమ్మారిని జయించేందుకు కృషి చేస్తోంది.
  • భారతీయులు ఈ సంక్షోభాన్ని కూడా చక్కటి అవకాశంగా మల్చుకోవాలి. భారతీయులకు వైఫల్యం అనే ఆప్షన్ ఉండనే కూడదు.
  • మానవాళిని కాపాడుకుంటూ ముందడుగేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
  • కరోనావైరస్‌పై యుద్ధంలో ప్రతీ ఒక్కరూ విధిగా భాగస్వాములవ్వాలి.
  • కరోనావైరస్ దేశంలోకి ప్రవేశించినప్పడు మన వద్ద పీపీఈ కిట్స్ తయారీ లేదు. అవసరం కొద్దీ N-95 మాస్కులు తయారు చేయించాం. కానీ ఇప్పుడు దేశంలో లక్షలకుపైగా పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు చేయిస్తున్నాం. అలా కరోనా సంక్షోభాన్ని కూడా భారత్ చక్కటి అవకాశంగా మల్చుకుంటోంది.
  • భారత దేశం అభివృద్ధి ఎప్పుడు ప్రపంచవికాసంతో ముడిపడి ఉంటుంది. బహిరంగ మలమూత్ర విసర్జనంపై నిషేధం, పోలియో నిర్మూలన వంటి ఉద్యమాలు ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి.
  • భారతదేశం, భారత దేశ చరిత్ర ఎంతో సుసంపన్నమైనదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ఈ కథనం మరింత అప్‌డేట్ అవుతోంది.

 

Trending News