న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి అమేథి లోక్ సభ స్థానం కంచుకోట లాంటిదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా అమేథితోపాటు రాహుల్ గాంధీ మరో స్థానం నుంచి కూడా పోటికి దిగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రస్ పార్టీ నేత ఏకె ఆంటోని ఆదివారం ప్రకటించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన మీడియా సమావేశంలో ఆంటోని ఈ ప్రకటన చేశారు.