న్యూ ఢిల్లీ : కరోనా వైరస్‌ని (Coronavirus) కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఉన్న వాళ్లంతా తమ స్వస్థలాలకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలా సొంతూళ్లకు వెళ్తున్న వలసదారులకు తమకు తోచిన రీతిలో సహాయపడాల్సిందిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధారణ ప్రజానీకంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నగరాల నుండి భారీ సంఖ్యలో జనం కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నందున వారు వెళ్లే మార్గంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆ వలసదారులకు అన్నపానీయాలు అందించి, సేదతీరేందుకు నీడ కల్పించాల్సిందిగా రాహుల్ గాంధీ కోరారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమకు ఉన్నంతలో కొంత చొరవ తీసుకుని వలసజీవులకు సహాయం చేయాల్సిందిగా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.



ఢిల్లీ-ఘాజియాబాద్ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో జనం ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంతూళ్లకు బాట పడుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమైన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. అలా సొంతూళ్లకు బాటపట్టిన వారిలో చాలామందికి చిన్నపిల్లలు, ఇంకొంత మందికి వృద్ధులు కూడా వెంట ఉన్న దృశ్యాలు చూస్తోంటే ఎవరి మనసుకైనా కష్టంగా అనిపించకమానదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..