Rahul Gandhi: అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారా.. ? కాంగ్రెస్ అగ్రనేత స్ట్రాటజీ అదేనా..?
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు తమ కుటుంబానికి కంచుకోటలా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రస్తుతం ఆయన కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని అమేథీ నుంచి బరిలో దిగబోతున్నట్టు సమాచారం.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ రాహుల్ గాంధీ.. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. ఆ సందర్భంగా రెండో విడతలో జరిగే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పాటు అక్కడ నామినేషన్‌ను తన సోదరితో కలిసి దాఖలు చేసారు. మరోవైపు ఈయన అమేథీ నుంచి పోటీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు రాహుల్ గాంధీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కూడా పోటీ చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒకవేళ అక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకుంటే యూపీలోని కాంగ్రెస్ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతో ఖచ్చితంగా పోటీ దిగాలనే కీలక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇక కేరళలోని వాయనాడ్‌కు రెండో విడతలో భాగంగా ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇక యూపీలో అమేథీ నియోజవర్గానికి ఐదో విడతలో భాగంగా మే 20న అక్కడ ఎన్నికల జరగనున్నాయి. రాహుల్ ప్రస్తుతం వాయనాడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. రెండో విడతలో భాగంగా వాయనాడ్‌లో ఎన్నికల ప్రచారం పూర్తైయిన తర్వాత వెంటనే అమేథీ నియోజవర్గంపై దృష్టి సారించనున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచింది. ఈ సారి అదే సీన్ రిపీట్ చేయాలని భారతీయ జనతా పార్టీ వర్గాలు అన్ని అస్త్ర శస్త్రాలను మోహరించాయి. మరోవైపు రాహుల్ గాంధీ ఈ సారి ఎలాగైనా ఈ స్థానం నుంచి గెలిచి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. అందుకే యూపీలోని అమేథీతో పాటు రాయబరేలి సహా పలు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయలేదు.
రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో కేవలం వాయనాడ్ నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రజలకు మాట ఇచ్చారు. మరోవైపు అమేథీ నుంచి కూడా బరిలో దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు వాయనాడ్ నుంచి పోటీ చేస్తోన్న రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 20 కోట్ల ఆస్తులున్నట్టు ప్రకటించారు. రూ. 11.14 కోట్ల వ్యవసాయ భూమి..రూ. 9.24 కోట్లు కార్లు ఇతర చరాస్తులు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. అంతేకాదు బీజేపీ లీడర్స్ చేసిన పరువు నష్టం కేసులు.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తో లింక్ ఉన్న క్రిమినల్ కేసులు వంటి వివరాలను తన నామినేషన్ పత్రాల్లో తెలిపారు.
వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ తరుపున మిసెస్ అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో ఉన్నారు. ఇక్కడ రెండో విడతలో భాగంగా ఈ నెల 26న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జూన్ 4న దేశ వ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook