Sankranti Festival: అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటన రైల్వే సేవల విషయం కాదు. పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాల విషయమై దక్షిణ మధ్య రైల్వే జాగ్రత్తలు చెబుతూ ప్రకటన చేసింది. గాలిపటాలు ఎగురవేసే వారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి పండుగను ఆనందంగా చేసుకోవాలని పేర్కొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kushboo Sundar: ప్రముఖ హీరోయిన్ ఫోన్ కాల్ లీక్.. మోదీ, బీజేపీపై హాట్ కామెంట్స్


రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయరాదని రైల్వే శాఖ సూచించింది. విద్యుత్తు తీగల నుంచి వేలాడుతున్న గాలిపటం దారాలను  తాకరాదని చెప్పింది. రైల్వే ప్రాంగణంలో యార్డులు, పట్టాల సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్న విషయాన్ని గుర్తుచేసింది. గాలిపటాలు ఎగరవేసేవారు రైళ్లను చూడకుండా వెళ్లడం.. విద్యుత్‌ తీగలు తాకి దుర్మరణం పాలైన సంఘటనలను రైల్వే శాఖ గుర్తుచేసింది.

Also Read: Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి బిగ్‌ బూస్ట్‌.. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు


గతేడాది సంక్రాంతి పండుగ సీజన్‌లో అలాంటి దారుణ సంఘటనలు భారతీయ రైల్వేలోని అనేక జోన్‌లలో చోటుచేసుకున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. 25 కేవీ  ట్రాక్షన్ ఓవర్‌హెడ్ కండక్టర్‌లలో చిక్కుకున్న గాలిపటం దారాలను తాకడంతో విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యారని వివరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే గాలిపటాల దారాల్లో విద్యుత్‌ ప్రవాహిస్తుందని.. వాటి వాడకం ప్రమాదకరమని తెలిపింది. 


సంక్రాంతి పండుగ సందర్భంగా తాము ప్రజల సహకారం కోరుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే పట్టాల సమీపంలో.. విద్యుత్‌ తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయరాదని సూచించింది. ఓవర్‌హెడ్ లైన్‌లు అధిక వోల్టేజ్ విద్యుత్‌తో ఛార్జ్ చేసి ఉండడంతో వాటిని దారాలు తగిలితే పెను ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించింది. ఓవర్‌హెడ్ కండక్టర్ల నుంచి గాలిపటం దారాలను వేలాడుతున్న సమయంలో రైల్వే అధికారులకు తెలపాలని విజ్ఞపతి చేసింది. శిక్షణ పొందిన సిబ్బంది సురక్షితంగా గాలిపటాల దారాలను తీసివేస్తారని.. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దారాలు ముట్టవద్దని స్పష్టం చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook