Kushboo Sundar: ఫోన్ కాల్ లీక్ అంశం తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోంది. అలనాటి ప్రముఖ హీరోయిన్.. బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ ఫోన్ కాల్ లీక్ చేశారనే వార్త కలకలం సృష్టించింది. తన అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఓ మీడియా ఛానల్‌పై కుష్బూ మండిపడుతున్నారు. అయితే ఆ వాయిస్ కాల్‌లో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీపై మాట్లాడారు.
ఏం జరిగింది?
తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఓ మీడియా సంస్థ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన కుష్బూ సుందర్‌ను సంప్రదించింది. 'బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు దూరం ఉంటున్నారు?' అని మీడియా ప్రశ్నించగా.. స్థానిక బీజేపీ నాయకత్వాన్ని ఖుష్బూ తప్పుబట్టారు. 'తమిళనాడు బీజేపీ నన్ను పట్టించుకోవడం లేదు' అని పేర్కొన్నారు. అయితే ఈ ఆడియోను ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో కలకలం రేపింది.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో 14 శాతం కమీషన్ ఇస్తేనే పనులు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
ఆమె వాయిస్ కాల్‌ను బీజేపీ నాయకత్వం తప్పుబట్టడంతో ఈ విషయం ఖుష్బూకు తెలిసింది. మీడియా సంస్థ తన నుంచి అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆ ఫోన్ కాల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని చెబుతూ తమిళనాడు బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. 'బీజేపీ కార్యక్రమాలకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వరు. నాకు ఆహ్వానం పలకరు. ఒకవేళ సమాచారం ఇచ్చినా ఆఖరి నిమిషంలో చెబుతారు' అని ఖుష్బూ ఆరోపించారు.
పార్టీ నాయకత్వంపై విమర్శలు
ఇక పార్టీ మార్పుపై వస్తున్న ఆరోపణలపై ఖుష్బూ స్పందిస్తూ.. 'నేను అయితే బీజేపీని వీడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తా' అని స్పష్టం చేశారు. ఖుష్బూ వ్యవహారం తమిళనాడు బీజేపీలో కలవరం రేపింది. ఒంటెద్దు పోకడలా రాష్ట్ర నాయకత్వం పని చేస్తోందని.. అన్నామలై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖుష్బూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. సమాచారం ఇవ్వకుండా.. సీనియర్లను పట్టించుకోకుండా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే త్వరలోనే పార్టీలోని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపుతుందని తెలుస్తోంది.
தமிழ்நாடு பாஜக என்னை புறக்கணிக்கிறது - நடிகை குஷ்பு பகிரங்க குற்றச்சாட்டு
"இதை மட்டும் போட்டுக்கோங்க.." @khushsundar குஷ்பு ஒப்புதல் அளித்ததற்கான ஆதாரம்..#MalaiMurasu #BJP #kushboo #Annamalai @annamalai_k pic.twitter.com/rBVpsj1WLh
— Malaimurasu TV (@MalaimurasuTv) December 30, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.