ముంబై: బీజేపీ సీనియర్ నాయకురాలు చంద్రకాంత గోయల్ వృద్ధాప్యం కారణంగా మరణించినట్టు రైల్వే మంత్రి (Piyush Goyal) పియూష్ గోయల్ వెల్లడించారు. తన తల్లి మరణవార్తను పియూష్ గోయల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. తన తల్లి తన జీవితాంతం ప్రజల సేవ కోసం అంకితం చేసిందని, ఇతరులు కూడా అదే విధంగా చేయమని ప్రేరేపించారని అన్నారు. ఆమెను శనివారం ఉదయం దహనం చేయనున్నట్లు మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తవ్డే తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: దావూద్ ఇబ్రహీం కరోనాతో మరణించాడా?


దేశంలో అత్యవసర పరిస్థితుల కాలం అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆ తరవాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ప్రకాష్ గోయల్ వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..