రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్- ఆహార సేవలు పునఃప్రారంభం!
Indian Railway: రైళ్లలో ప్రయాణికులకు వండిన ఆహారం సరఫరా చేసే సేవలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
The Railway Board has issued an order to resume serving cooked meals: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను కూడా సడలిస్తు వస్తోంది ప్రభుత్వం.
ఇందులో భాగంగా.. రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రైళ్లలో ఆహారం అందించే (Food service in Trains) సేవలను పునరుద్ధరించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఓ లేఖలో (IRCTC on Food servies in Train) పేర్కొంది.
కరోనా సంక్షోభం తర్వాత.. రైల్వే సేవలు దాదాపుగా పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఇప్పటికే కొవిడ్ నిబంధనల నడుమ కార్యకలాపాలు సాగుతున్నవిషయాన్ని గుర్తు చేసింది. దీనికి తోడు కరోన నుంచి కొలుకుంటున్నట్లు సంకేతాలు వస్తుండటం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రైళ్లలో కూడా అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఆహారం అందించే సేవలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఐఆర్సీటీసీ.
Also read: మందు బాబులు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరు... ఎక్సైజ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు...
ఇటీవలే దేశీయ విమానాల్లో కూడా..
విమానాల్లో తక్కువ దూరాలకు అంటే.. 2 గంటల్లోపు ప్రయాణ సమయం ఉన్న ఫ్లయిట్లలో కూడా ఆహారం అందించే విధానాన్ని పునరుద్ధరించవచ్చని పౌర విమానయాన శాఖకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవల అనుమతులు ఇచ్చింది. యింపు ఇచ్చినా.. గ్లవ్స్, మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించి.. కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారమే ఈ సేవలను అందించాలని స్పష్టం చేసింది.
Also raad: వైరల్ వీడియో... సాగు చట్టాలపై రాహుల్ గాంధీ గతంలో చెప్పిందే నిజమైంది...
Also read: 580 ఏళ్ల తర్వాత వచ్చిన సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook