న్యూ ఢిల్లీ : అంఫన్ తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ( Landfall of Cyclone Amphan ) మొదలైంది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రక్రియ మొదలవగా.. దాదాపు 4 గంటలపాటు సైక్లోన్ ల్యాండ్ ఫాల్ కొనసాగుతుందని ఒడిషాలోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికే జనా తెలిపారు. ఇప్పటికే పారాదీప్, కెండ్రపారా, ధమ్ర దాటేసిన అంఫాన్ తుఫాన్.. ప్రస్తుతం బాలాసోర్‌ను ( Balasore in Odisha ) ఆనుకుని ఉన్న తీరం వద్ద కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సాయంత్రంలోగా పశ్చిమ బెంగాల్‌‌లోని దిఘా -హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ( Read also : తీరం దాటనున్న సూపర్ సైక్లోన్ )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంఫన్ తుపాన్ ( Cyclone Amphan ) తీరం దాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చండీపూర్ వద్ద ప్రస్తుతం అటువంటి వాతావరణమే నెలకొంది. చండీపూర్ వద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అంఫన్ తుపాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అంఫాన్ తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో 5 లక్షలకుపైగా జనాన్ని, ఒడిషాలో 1,58,640 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ( Also read : Shramik special trains : ఇంకెక్కడి సోషల్ డిస్టన్సింగ్ ? )


 ఇదిలావుంటే, ఆంధ్రా తూర్పు తీరంలోనూ అప్రమత్తత కొనసాగుతోంది. తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. (Read also : ఏపీలో తాజాగా 68 కరోనా కేసులు, ఒకరి మృతి )


ఫణి తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ తుఫాన్ అనంతరం అటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ బృందాల అధినేత ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. తుఫాన్ తర్వాత పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొచ్చి రవాణా సౌకర్యాలు పునరుద్ధరించేందుకు వీలుగా ఎన్డీఆర్ బృందాల వద్ద ట్రీ కట్టర్స్, పోల్ కట్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని ప్రధాన్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..