ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఎంఫాన్.. తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఎంఫాన్ తుఫాన్ పయనిస్తోంది. ఇవాళ (బుధ వారం ) మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని డిఘా దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటనుంది.
ప్రస్తుతం ఎంఫాన్ తుపాన్.. ఒడిశాలోని పారాదీప్‌కు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ..IMD తెలిపింది. సముద్ర ఉపరితలంపైనే బలహీనపడిన తుపాన్.. తీవ్రమైన తుపాన్ నుంచి సూపర్ సైక్లోన్‌గా మారిందని వెల్లడించింది. ఎంఫాన్ తుఫాన్ తీరం దాటే సమయంలో దాదాపు 155 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఒడిశా తీర ప్రాంతంలో తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలోనూ తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపింది.
#WATCH Strong winds at Chandipur in Balasore district, as #CycloneAmphan is expected to make landfall today. #Odisha pic.twitter.com/O87dN6mWnd
— ANI (@ANI) May 20, 2020
ఎంఫాన్ తుపాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కరోనా ప్రభావం కూడా ఉన్న కారణంగా.. ఎక్కువ మందిని ఒకే చోట ఉంచకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు తుపాన్ ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం 41 NDRF బృందాలను రంగంలోకి దించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. NDRF,SDRF బృందాలకు PPE కిట్లు కూడా అందించారు. తద్వారా వారు కరోనా బారిన పడకుండా .. తుపాన్ సహాయ చర్యలు కొనసాగించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎంఫాన్ తుపాన్‌పై అసోం ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హై అలర్ట్ జారీ చేసింది. తుఫాన్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
#WATCH Odisha: Strong winds of up to 82 km/ph speed hit Paradip. #CycloneAmphan is expected to make landfall today. pic.twitter.com/8bgyZ2Augq
— ANI (@ANI) May 20, 2020
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..