ఢిల్లీలో భారీ వర్షాలు.. చల్లచల్లగా దేశ రాజధాని
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భారీగా వర్షం (Heavy Rains in Delhi) కురుస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనుందని భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే వెల్లడించింది. కీర్తినగర్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తీన్ మూర్తి మార్గ్, రైల్ భవన్, మింటో రోడ్ సహా పలు ప్రాంతాలలో భారీగా వర్షం (Delhi Heavy Rains) కురిసింది. మరో మూడు రోజులపాటు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
ఢిల్లీ(Delhi)తో పాటు రాజధాని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఢిల్లీ, నోయిడా, రోహ్‌తక్, సోనిపట్, గురుగ్రామ్, ఘజియాబాబ్, ఫరిదాబాద్తో పాటు రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం తలెత్తింది. పలు ప్రాంతాల్లో వాహనాలు వర్షపు నీళ్లల్లో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో ఢిల్లీలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. మింటో బ్రిడ్జి కింద ఓ బస్సు చిక్కుకుపోయింది. ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది బస్సు నుంచి ప్రయాణికుల్ని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్
ఢిల్లీతో సహా దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో జులై 21 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని భారత వాతావారణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం చల్లటి వాతావరణాన్ని ఢిల్లీవాసులు ఆస్వాదిస్తున్నారు. చల్లదనానికి కాస్త సేదతీరుతున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..