Rajasthan Accident update: బస్సు, ట్రక్కు ఢీ...11 మంది మృతి, 22 మందికి గాయాలు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
Rajasthan Road Accident: రాజస్థాన్ బార్మర్ జిల్లా(Barmer district)లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. బార్మర్-జోధ్‌పుర్ జాతీయ రహదారి వద్ద ఉన్న బందియావాస్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఎంత మంది మరణించారనేది ఇప్పుడే చెప్పలేమని, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయని బార్మర్ జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు.ఈ ఘటనపై స్పందించిన సీఎం అశోక్ గహ్లోత్(CM Ashok Gehlot).. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. బార్మర్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు.
Also Read: Suicide: పరువు పోయిందనే బాధతో...విషం తాగి ఐదుగురు ఆత్మహత్య
ప్రధాని మోదీ విచారం
ఈ ఘటనలో మృతి చెందిన వారికి ప్రధాని మోదీ(PM Modi) సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల, గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను మోడీ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook