Corana Positive: సీఎం, మాజీ సీఎంలకు కరోనా పాజిటివ్.. కార్యకర్తల్లో ఆందోళన
CM Ashok Gehlot Tested Corona Positive: దేశంలో కరోనా కేసుల పెరుగులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే కరోనా బారిన పడ్డారు.
CM Ashok Gehlot Tested Corona Positive: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను తేలికపాటి లక్షణాలతో కోవిడ్ బారిన పడినట్లు చెప్పారు. వైద్యుల సలహా మేరకు.. రాబోయే కొద్ది రోజులు తన నివాసం నుంచే పనిచేస్తానని తెలిపారు. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని కోరారు.
సీఎం గెహ్లాట్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్ట్‌లో తనకు పాజిటివ్ వచ్చిందనిని ఆమె ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు తాను పూర్తిగా ఐసోలేషన్‌లో ఉన్నానని.. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. బీజేపీ కమిటీ సమావేశానికి వసుంధర రాజే హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ పెద్ద నేతలు హాజరుకావడంతో పార్టీ కార్యాలయం కూడా కిక్కిరిసిపోయింది. వసుంధర రాజేకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర బీజేపీ నాయకులు తమకు కూడా కోవిడ్ వచ్చిందేమోనని భయపడుతున్నారు.
ముఖ్యమంత్రికి కరోనా సోకడంతో ఆయన అమృత్‌సర్ వెళ్లాల్సిన కార్యక్రమం రద్దు చేసుకున్నారు. గెహ్లాట్ సూరత్ వెళ్లి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పలువురు నేతలను కలిశారు. రానున్న కొద్దిరోజుల పాటు సీఎం తన నివాసం నుంచే విధులు నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖాపరమైన సమావేశాలకు హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా రాజస్థాన్‌లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది నేతలు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్
Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి