Omicron cases in Rajasthan : జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ఇన్‌ఫెక్షన్ రాజస్థాన్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. జైపూర్‌లో ఒమిక్రాన్ సోకిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మిగతా ఐదుగురు వారితో కాంటాక్టులోకి వచ్చిన వారు. ఒమిక్రాన్ సోకిన నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఇటీవలే సౌతాఫ్రికా (South Africa returnees) నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ నిర్థారణ అయిన నలుగురు కుటుంబసభ్యులను రాజస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RUHS) లో చేర్పించి అనంతరం వారితో కాంటాక్టులోకి వచ్చిన మరో ఐదుగురిని కూడా ట్రేస్ చేసినట్టు రాజస్థాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వైభవ్ గల్రియా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మొత్తం 9 మందిని రాజస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు వైభవ్ పేర్కొన్నారు. 


Also read : Omicron vs booster dose: ఒమిక్రాన్ కేసులకు బూస్టర్ డోసులతో చెక్ పెట్టొచ్చా ?


తాఫ్రికా నుంచి తిరిగొచ్చిన నలుగురితో కాంటాక్టులోకి వచ్చిన 34 మంది శాంపిల్స్ సేకరించి జెనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వారిలో తొమ్మిది మందికి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పాజిటివ్ (Recovery in Omicron positive cases) అని నిర్ధారణ అయిందని వైభవ్ వెల్లడించారు. శిఖర్ జిల్లా అజిత్‌ఘడ్ నుంచి కూడా మరో కుటుంబం ఈ కుటుంబంతో టచ్‌లోకి వచ్చిందని.. వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.


Also read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook