Omicron: దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు.. 11 మందికి పాజిటివ్! భయాందోళనలో హైదరాబాద్‌!!

ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం భయాందోళనకు గురవుతోంది. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు రావడమే ఇందుకు కారణం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 01:31 PM IST
  • దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది ప్రయాణికులు
  • దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 11 మందికి పాజిటివ్
  • భయాందోళనలో హైదరాబాద్‌
Omicron: దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు.. 11 మందికి పాజిటివ్! భయాందోళనలో హైదరాబాద్‌!!

Omicron Variant: 185 passengers came from South Africa to Hyderabad, 11 tested positive: కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న వార్తలే ఇందుకు కారణం. దక్షిణాఫ్రికా (South Africa)లో బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భారత్ (India) కూడా అప్రమత్తమవుతోంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌ (Hyderabad) నగరం భయాందోళనకు గురవుతోంది. దక్షిణాఫ్రికా (South Africa) నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు రావడమే ఇందుకు కారణం. నవంబర్ 25, 26, 27 తేదీల్లో 185 మంది ప్రయాణికులు (185 passengers) హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో దిగారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వారడమే అందరిలో భయం మొదలైంది. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చినవారు ఇందులో ఉన్నారు. భాగ్యనగరం వచ్చినవారందరికీ ప్రత్యేక బృందాలు ఆర్‌టీపీసీఆర్‌ (RTPCR) పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి పాజిటివ్‌ అని తేలడం విశేషం.

Also Read: The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?

పాజిటివ్‌ అని తేలిన ప్రయాణికుల రక్త నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు తెలిసింది. అక్కడ ఈ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తారు. ఆ పరీక్షలో వారికి సోకింది ఏ వేరియంటో తేలనుంది. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ఆసుపత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అంక్షలు విధించారు. 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ తప్పని సరిచేసారు. విమానాశ్రయంలో మరోసారి వైరస్ పరీక్ష చేయనున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: 1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు!

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ (Telangana) ప్రజారోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ రోజున జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ.. తప్పనిసరిగా మాస్కు ధరిస్తేనే వైరస్‌ను అడ్డుకోగలమని నిపుణులు అంటున్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ (Omicron ) మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా? అనే విషయాలపై 'ఇంకా స్పష్టంగా తెలియదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ కొత్తరకం వేరియంట్‌ వల్ల ఎలాంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News