Omicron Case: బెంగళూరులో వెలుగు చూసిన తొలి ఒమిక్రాన్ కేసు దేశవ్యాప్తంగా కలవరం కల్గించింది. అయితే బెంగళూరులో నమోదైన కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే గుడ్‌న్యూస్ అందుతోంది.
దేశంలో అప్పుడే 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో వెలుగు చూసిన వెంటనే దేశవ్యాప్తంగా కలకలం రేగింది. డెల్టా వేరియంట్‌ను మించిన ప్రమాదకర వేరియంట్ అని తేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు రేగాయి. ఇప్పుడు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5కు చేరింది. మరికొన్ని పరీక్షల వివరాలు రావల్సి ఉంది.
ఈ నేపధ్యంలో బెంగళూరు నుంచి అందిన వార్త ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)విషయంలో నెలకొన్న ఆందోళనను తగ్గిస్తోంది. బెంగళూరులోని బోరింగ్ అండ్ లేడీ కర్ణన్ ఆసుపత్రి వర్గాలు ఊరట కల్గించే అంశాన్ని ప్రకటించాయి. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన డాక్టర్ కోలుకున్నారని..ఏ విధమైన సమస్యల్లేవని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రైమరీ కాంటాక్ట్ అయిన భార్య, కూతురు, మరో వైద్యుడు కూడా కోలుకుంటున్నారని తెలిసింది.
60 బెడ్స్ ఉన్న ఆసుపత్రి ఓ వార్డు మొత్తం ఐదుగురికి కేటాయించామని..చికిత్స అందుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ బాధితులకు వైద్యం అందించిన డాక్టర్లు, సిబ్బందిని ఇతర వార్డులకు వెళ్లనివ్వడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ కూడా సాధారణమైందేనని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ 19కు అందించిన చికిత్సే ఈ వేరియంట్‌కు కూడా అందించారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో(Monoclonal Antibodies)చికిత్స చేసిన తరువాత బాధితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ఏ విధఘమైన ఆందోళన అవసరం లేదని..కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాటిస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వైద్యుడిలో ఒళ్లు నొప్పులు, చలి, తేలికపాటి జ్వరం ప్రధాన లక్షణాలుగా కన్పించాయని చెప్పారు. బాధితుడికి శ్వాస, రక్త సంబంధమైన ఇబ్బందులు తలెత్తలేదన్నారు.
Also read: Health benifits of Cinnamon: దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Omicron Case: గుడ్‌న్యూస్..కోలుకున్న ఒమిక్రాన్ తొలి బాథితుడు