Coronavirus In India: కరోనావైరస్ సంక్షోభం( Corona Pandemic ) సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్  పాఠాలకు ( Online Classes ) కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే  విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక పాఠశాలలు ఏదో విధంగా ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan ) ఒక అదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 9 నుంచి జూన్ 30 మధ్య  సమయానికి సంబంధించిన ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేసింది. ఆన్ పాఠాలు చెప్పే పాఠశాలకు కూడా దీని నుంచి మినహాయింపు లేదు అని తెలిపింది. కోవడ్-19 వైరస్ ( Covid-19 Virus ) సంక్రమణ పెరగడంతో ప్రభుత్వం అన్ని పరీక్షలు వాయిదా వేసింది.  Also Read : Aarogya Setu: ఆరోగ్యసేతు యాప్‌లో కొత్త ఫీచర్


కరోనావైరస్ ( Covid-19 ) కట్టడికి మార్చి 14 నుంచే రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అయితే  ప్రస్తుతం అక్కడ 19532 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15640 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3445 ఉండగా, 447 మంది మరణించారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..