కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఎదుర్కొంటున్న మూడో దేశం. దేశవ్యాప్తంగా వారం రోజులుగా కనీసం 20వేలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 22,752 కరోనా పాజిటివ్ కేసులు (India CoronaVirus Cases) నిర్ధారించారు. దీంతో జులై 8 నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య (COVID19 Cases In India) 7,42,417కి చేరింది. సుశాంత్ నా 4 సినిమాలు రిజెక్ట్ చేశాడు: భన్సాలీ
అదే సమయంలో భారత్‌లో నిన్న ఒక్కరోజు కోవిడ్19 బారిన పడ్డ 482 మంది బాధితులు మరణించారు. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 20,642కు చేరుకుంది. మొత్తం బాధితులకుగానూ చికిత్స అనంతరం 4,56,831 మంది ప్రాణాంతక వైరస్ బారి నుంచి కోలుకోగా, ప్రస్తుతం 2,64,944 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
కాగా, గత వారం రోజుల్లోనే దేశంలో 1.60 లక్షల కొత్త కేసులు నమోదు కావడంతో పాటు 3242 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతానికి భారత్‌లో కోవిడ్19 బారి నుంచి కోలుకుంటున్న వారి రికవరీ రేటు 61శాతం ఉండటం గమనార్హం. కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్.. మరణాలలో 8వ స్థానంలో కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos