న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఝార్ఖండ్‌లో సోమవారం జరిగిన చివరి దశ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ.. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిదని.. ఈ నేపథ్యంలో తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల్లోనే ఆకాశాన్నంటేలా మందిర నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : అయోధ్యపై ఇంకొన్ని ఇతర వార్తలు


రివ్యూ పిటిషన్ల మాటేమిటి..?
అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం కోర్టు తీర్పుపై పలు ముస్లిం పార్టీలు ఇప్పటికే రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై త్వరలోనే విచారణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. Related News : అయోధ్య తీర్పునకు సంబంధించిన వార్తలు