Rammandir New Row: మరి కొద్దిరోజుల్లో కొత్త ఏడాదిలో హిందూవుల కలగా మారిన అయోధ్య రామాలయం ప్రారంభం కానుంది. ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను.. ప్రతిష్టాత్మక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావద్దని చెప్పడంపై వివాదం పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర ఆలయం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. జనవరి 1 నాటికి మొత్తం పనులు పూర్తి కానున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే దేశంలో అయోధ్య సమస్యను తెరపైకి తీసుకొచ్చి, రామాలయ నిర్మాణ పోరాటానికి ఆజ్యం పోసి, బీజేపీ అధికారంలో వచ్చేందుకు కారణమైన అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను మాత్రం రామాలయం ప్రాణ ప్రతిష్ఠకు రావద్దని రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా రావద్దని తాము చేసిన విజ్ఞప్తికి అద్వానీ, జోషి అంగీకరించారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సైతం స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమౌతోంది. 


అద్వానీ, జోషికు నో...దేవెగౌడకు వెల్‌కమ్


దేశంలో అయోధ్య అంశాన్ని తెరపై తీసుకొచ్చి రామమందిర నిర్మాణానికి అహర్నిశలూ పోరాటం చేసిన అగ్రనేతల్ని ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు రావద్దని ఎలా చెబుతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయస్సు, ఆరోగ్యమే కారణమైతే ఇంచుమించు మురళీ మనోహర్ జోషి, ఎల్‌కే అద్వానీ వయస్సున్న 90 ఏళ్ల మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడను ప్రాణ ప్రతిష్టకు రమ్మని ఎలా ఆహ్వానించారని రామజన్మభూమి ట్రస్ట్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావల్సిందిగా రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు స్వయంగా బెంగళూరు వెళ్లి దేవెగౌడను ఆహ్వానించారు. 


ఎల్‌కే అద్వాని వయస్సు ఇప్పుడు 96 ఏళ్లు కాగా, మురళీ మనోహర్ జోషి వయస్సు 89. ఈ ఇద్దరినీ వయస్సు కారణం చెప్పి రావద్దని చెప్పిన రామ జన్మభూమి ట్రస్ట్..90 ఏళ్ల దేవెగౌడను ఎలా ఆహ్వానించిందనే ప్రశ్నలు వస్తున్నాయి. దేవెగౌడను ఆహ్వానించినప్పుడు ఆయన వీల్ ఛైర్ సౌకర్యం కోరితే..ట్రస్ట్ సభ్యులు వీల్ ఛైర్‌తో పాటు ఓ మనిషిని ప్రత్యేకంగా దీనికోసం నియమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.


ఇప్పుడీ వివాదం పెరిగి పెద్దదవుతుండటంతో విశ్వహిందూపరిషత్ రంగంలో దిగింది. వీహెచ్‌పి పెద్దలు కొంతమంది స్వయంగా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి రామమందిరం ఆలయ ప్రారంభోత్సవానికి రావల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేవెగౌడకు ఏర్పాటు చేసినట్టే వీల్ చైర్ ఏర్పాట్లు చేస్తామని వీహెచ్‌పి తెలిపింది. 


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook