RBI Office Attendant Recruitment 2021 Apply Online For 841 Posts: దేశంలో బ్యాంకులకే బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాలలో పలు ఆఫీసు అటెండెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం 10వ తరగతి అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొలువు సాధించే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా నైపుణ్యాలు పరీక్షించి పోస్టులను కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 841 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, హైదరాబాద్ కేంద్రంలో 57 పోస్టులున్నాయి. మీరు బ్యాంక్ ఉద్యోగులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కమిషన్, యూపీఎస్సీ, ఇతరత్రా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి  ఆఫీస్ అటెండెంట్ పరీక్ష(RBI Recruitment 2021) కాస్త ఈజీగా అనిపిస్తుంది. 


Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో


పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24న మొదలైన ఆర్‌బీఐ(Reserve Bank of India) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల దరఖాస్తులు మార్చి 15న ముగియనున్నాయి. ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 9, 10 తేదీలలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. SC/ST/PwBD/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు దరఖాస్తు ఫీజు రూ.50 చెల్లించాలి, OBC/EWS/General అభ్యర్థులు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. 
ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి - Apply Online For RBI Office Attendant Posts


నాలుగు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ 30, జనరల్ ఇంగ్లీష్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. మొత్తం 90 నిమిషాలలో పరీక్ష పూర్తి చేయాలి. నెగటివ్ మార్కులు సైతం ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో కటాఫ్ మార్కులు వస్తేనే వ్యాలిడ్ అవుతారు. ఇందులో క్వాలిఫై అయిన వారి జాబితా సిద్ధం చేసి స్థానిక భాష మీద ప్రావీణ్యాన్ని పరీక్షించేందుకు ల్యాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించనున్నారు.


ప్రాంతాల వారీగా పోస్టుల వివరాలు ఇవే..
హైదరాబాద్‌-57, ముంబయి-202, చెన్నై-71, కాన్పూర్‌-69, నాగ్‌పూర్‌-55, అహ్మదాబాద్‌-50, న్యూఢిల్లీ-50, సిమ్లా-47, జయపుర-43, గువాహటి-38, కోల్‌కతా-35, చండీగఢ్‌-31, బెంగళూరు-28, భోపాల్‌-25, పట్నా-28, తిరువనంతపురం-26, భువనేశ్వర్‌-24, జమ్మూ-9 


Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


RBI Recruitment 2021, RBI Jobs 2021, Reserve Bank of India, Govt Jobs 2021, Govt Jobs, RBI Recruitment, RBI Jobs, RBI, RBI Posts 2021, RBI Posts, Jobs 2021, ప్రభుత్వ ఉద్యోగాలు 2021, ఉద్యోగాలు, ఆర్‌బీఐ జాబ్స్ 2021, ఆర్‌బీఐలో ఉద్యోగాలు