జియో రాకతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ( Reliance Jio ).. తాజాగా జియో గ్లాస్‌ని ( Jio Glass ) ప్రవేశపెట్టి భారత్‌లో మరో ఆవిష్కరణకు తెరతీసింది. 43వ యాన్వల్ జనరల్ మీటింగ్‌ ( 43rd AGM ) వేదికగా జియో గ్లాస్‌ని ఆవిష్కరించిన రిలయన్స్ జియో.. ఈ గ్లాసెస్ ప్రత్యేకతలు ఏంటి ? ఎలా పని చేస్తాయి అనే వివరాలను వెల్లడించింది. కరోనావైరస్ ( Coronavirus ) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వర్చువల్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్స్‌ కాల్స్‌కి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో రిలయన్స్ జియో ఈ జియో గ్లాస్‌ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే స్నాప్ ప్రవేశపెట్టిన స్పెక్టాకిల్స్ 3కి ( Snap`s spectacles 3 ) పోటీగానే రిలయన్స్ జియో ఈ జియో గ్లాస్‌ని తీసుకొచ్చినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రానున్నది 5జీ నెట్ వర్క్ యుగం కావడంతో అందుకు అనుగుణంగానే రిలయన్స్ జియో ఈ నెక్ట్స్ జనరేషన్ ప్రోడక్టుని తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( Also read: Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ? )


డిజిటల్ ఇండియాకు ఊతం..
ఇండియాను డిజిటల్ ఇండియాగా ( Digital India ) మార్చేందుకు సంస్థ చేస్తోన్న కృషిలో భాగంగానే జియో గ్లాస్ ఆవిష్కరణ జరిగినట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. 5G నెట్‌వర్క్‌తో ( 5G network ) రిలయన్స్ జియో గ్లాస్ పని తీరు మెరుగ్గా ఉంటుందని జియో తెలిపింది. అంతేకాకుండా 5G స్పెక్ట్రం వేలం ( 5G spectrum auction ) పూర్తయితే.. భారత్‌లో 5జీ టెస్టింగ్ సైతం ప్రారంభిస్తామని జియో స్పష్టంచేసింది.


( Also read : JioMeet vs Zoom: జియో మీట్‌కి జూమ్‌కి తేడాలు ఏంటి ? )


జియో గ్లాస్ ధర ఎంత ( Jio Glass price ) ?
జియో గ్లాస్ ధర ఎంత, ఎప్పుడు వినియోగదారుల చేతికి వస్తుంది అనే విషయాలను రిలయన్స్ జియో ఇంకా వెల్లడించలేదు. అయితే, ప్రస్తుతం భారత్‌లో స్నాప్ స్పెక్టాకిల్స్ 3 ధర ( Snap`s spectacles 3  price ) మాత్రం రూ.29,999 గా ఉంది. స్నాప్ స్పెక్టాకిల్స్ 3 కి పోటీగా వస్తోన్న ప్రోడక్ట్ కావడంతో అంతకంటే తక్కువ ధరకే జియో గ్లాసెస్ అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


( Also read: International flights: అంతర్జాతీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? )


జియో గ్లాస్ ఫీచర్స్, ప్రత్యేకతలు ఏంటి..
Jio Glass పని చేసే తీరుపై 43వ ఏజీఎంలో ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ ఒక డెమో ద్వారా వివరించారు. జియో గ్లాసెస్ బరువు 75 గ్రాములు ఉంటుంది. హై రిజల్యూషన్ డిస్ ప్లే కలిగిన ఈ స్మార్ట్ గ్లాసెస్‌కి పర్సనలైజ్డ్ ఆడియో ఆప్షన్ కూడా ఉంది. దీంతో జియో గ్లాస్ ధరించినప్పుడు ప్రత్యేకంగా మరే ఇతర ఆడియో పరికరాలు లేకుండానే ఆడియో వినేందుకు వీలు ఉంది. అన్నిరకాల ఆడియో ఫార్మాట్స్ సపోర్ట్ చేసే విధంగా జియో గ్లాసెస్‌ను రూపొందించారు. జియో గ్లాస్‌కి 25 అప్లికేషన్లకు అనుసంధానం చేసుకోవచ్చు. ( Also read: 
Android 11 update: ఆండ్రాయిడ్ 11 రిలీజ్ డేట్, స్మార్ట్ ఫీచర్స్ ఇవే )


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధ్యక్షుడు కిరణ్ థామస్ ఈ జియో గ్లాస్ గురించి మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యుగంలో జియో గ్లాస్ ఒక పెను విప్లవం సృష్టించనుందని అన్నారు. ఇప్పటివరకు జాగ్రఫీ గురించి నేర్చుకున్న సంప్రదాయ పద్ధతి జియో గ్లాస్ రాకతో ఓ చరిత్రగా మిగిలిపోతుందని.. 3D క్లాస్‌రూమ్‌ ( 3D Glassrooms ) పాఠాలకు జియో గ్లాస్ ఎంతో ఉపయోగపడుతుందని కిరణ్ థామస్ తెలిపారు. ( Also read: Instagram Reels: టిక్‌టాక్ స్థానంలో రీల్స్ యాప్.. ఇండియాలో ట్రయల్ షురూ! )