జియో ఫోన్ వినియోగదారుల కోసం వైఫై హాట్‌స్పాట్ అప్‌డేట్ విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. తాజాగా వారి కోసం రూ.594, రూ.297లతో మరో రెండు రకాల రీచార్జ్ టారిఫ్‌లను ప్రవేశపెట్టింది. రూ.594 టారిఫ్ కింద 6 నెలల కాల పరిమితి( 6X28 రోజులు), రూ.297 రీచార్జ్ కింద 3 నెలలు (3X28 రోజులు) కాల పరిమితి అందించనున్నట్టు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. 


ఈ రెండు రకాల టారిఫ్‌లలో ఉచిత వాయిస్ కాల్స్, అపరిమితమైన ఇంటర్నెట్ డేటా, జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సిస్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తోంది.