Republic Day Updates: రిపబ్లిక్ డే 2021 నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఢిల్లీ మెట్రో
Republic Day 2021 News Updates:
Republic Day 2021 News Updates: గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పలు కార్యక్రమాలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇదివరకే కొన్ని కార్యక్రమాలకు ముఖ్య అథితిగా ప్రధాని నరేంద్ర మోదీ హజరయ్యారు. మరోవైపు జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు రైతులు సైతం సిద్ధంగా ఉన్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) రిపబ్లిక్ డే నాడు తన సర్వీసులపై అప్‌డేట్ ఇచ్చింది. ఢిల్లీలోని మెట్రో రైలు స్టేషన్లలో పార్కింగ్ సర్వీస్ తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. జనవరి 25న ఉదయం 6 గంటల నుంచి జనవరి 26 (Republic Day 2021 Latest Updates)న మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని మెట్రో రైలు స్టేషన్లలో వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని పోస్ట్ చేసింది.
Also Read: Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు
లోక్ కళ్యాణ్ మార్గ్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లు ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేసి ఉంటాయి. సెంట్రల్ సెక్రటేరియట్ స్టాప్ ఇంటర్‌ఛేంజ్ స్టాప్‌గా ఉండనుంది. కొన్ని స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ కొంత సమయం మూసివేసి ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
అలాగే సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు జనవరి 26న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూసివేయనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు వీక్షించేందుకుగానీ, ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ(Delhi On January 26)కి వెళ్లే సందర్శకులు కచ్చితంగా ఈ 26న రాష్ట్ర ప్రభుత్వ, ఇతర ప్రభుత్వ సంస్థల నియమాలు తెలుసుకోవడం ఉత్తమం.
Also Read: BSNL Republic Day 2021 Offer: రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook