Republic Day 2023: గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?
Republic Day 2023: ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటారు. అయితే చాలా మందికి గణతంత్ర వేడుకలను ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అయితే ఆ రోజు ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Republic Day 2023: దేశంలో ప్రతి సంవత్సరం మనమందరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నిజానికి ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత దేశంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈసారి దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంలో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం దేశానికి జాతీయ పండుగ కావడంతో భారత ప్రభుత్వం.. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు రాజ్‌పథ్‌లో సైనికులు గ్రాండ్‌తో పాటు కవాతు నిర్వహిస్తారు. అయితే మనం ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని మొదటిసారి ఎక్కడ, ఎలా జరుపుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదటి గణతంత్ర దినోత్సవాన్ని ఎక్కడ, ఎలా జరుపుకున్నారో తెలుసా?:
దేశంలో మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న ఢిల్లీలో జరుపుకున్నారు. అక్కడే రిపబ్లిక్ డే మొదటి పరేడ్ కూడా నిర్వహించారు. అప్పుడు పాత కోట దగ్గర బ్రిటిష్ స్టేడియం ఉండేది. తొలి కవాతును అక్కడే ప్రజలకు తిలకించారు. ఢిల్లీలోని పాత కోటలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసన్ జెండాను ఎగరవేశి ప్రసంగం చేశారు. ఈ వేడుకల్లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు?:
భారతదేశంలో జనవరి 26, 1950లో మొదటి గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. భారత రాజ్యాంగం కూడా ఈ రోజే అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ కూడా దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 26 జనవరి 1950న దేశం పూర్తిగా గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. దీంతో ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటారు. అయితే 1930 సంవత్సరంలో 26 తేదినే భారత జాతీయ కాంగ్రెస్ దేశాన్ని పూర్తిగా స్వతంత్ర దేశంగా ప్రకటించింది. అందుకే దేశ వ్యాప్తంగా 26 జనవరిని ప్రత్యేకంగా జరుపుకుంటారు.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి