Republic Day parade reharsal at rashtrapathi bhavan delhi : ఘనంగా గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు
భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 కు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఢిల్లీ రైసినా హిల్స్ ఇందుకోసం ముస్తాబవుతోంది. రాష్ట్రపతి భవన్ ఎదుట రాజ్ పథ్ లో ముమ్మురంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 కు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఢిల్లీ రైసినా హిల్స్ ఇందుకోసం ముస్తాబవుతోంది. రాష్ట్రపతి భవన్ ఎదుట రాజ్ పథ్ లో ముమ్మురంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది.
మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ లో చేయాల్సిన విన్యాసాలపై త్రివిధ దళాలు దృష్టిసారించాయి. ఇప్పటి వరకు ఆయా రెజిమెంట్లు, బెటాలియన్లకు పరిమితమైన అభ్యాసాలను .. ఇప్పుడు నేరుగా రాజ్ పథ్ లోనే చేశారు. డ్రెస్ లలో రిహార్సల్ చేయడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సీఆర్పీఎఫ్ కు చెందిన మహిళ జవాన్లు బైక్ ల మీద చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిపిస్తాయి. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ సందర్భంగా త్రివిధ దళాల జవాన్ల విన్యాసాలు మీరూ చూడండి.