RBI New Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ విన్పించింది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మరో ఆరు నెలలు ఆర్ధికపరమైన వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం( Corona Crisis)నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఆర్ధికపరమైన వెసులుబాట్లు కల్పించింది. ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నందున మరోసారి ఆర్ధిక వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది. ఆరు నెలలపాటు ఆర్ధిక వెసులుబాటు ఇవ్వనున్నామని ప్రకటించింది. ఆర్బీఐ కొత్త నిర్ణయం ప్రకారం వేస్ అండ్ మీన్స్ పరిమితి 2 వేల 416 కోట్లరూపాయలు 6 నెలలు కొనసాగనుంది. వేస్ అండ్ మీన్స్‌కు సంబంధించి రోజుల పరిమితి, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో గతంలో సడలించిన పరిమితులు కూడా ఇంకొన్నాళ్లు కొనసాగుతాయి. కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితుల్ని మరోసారి సమీక్షించిన ఆర్బీఐ(RBI)ఈ నిర్ణయం తీసుకుంది. 2022 మార్చ్ 31 వరకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.


రాష్ట్రాలకు సంబంధించిన వసూళ్లు, చెల్లింపుల మధ్య సర్దుబాటు ప్రక్రియ మరింత సులభంగా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఈ వెసులుబాటును 2020 ఏప్రిల్ నెలలో కల్పించారు. ఆ తరువాత ఆరు నెలలపాటు పొడిగించారు. తిరిగి 2022 మార్చ్‌లో సమీక్షించనున్నారు. ఒక నెలలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని(Over Draft Facility)ప్రతి రాష్ట్రం 14 రోజులు వినియోగించుకునే అవకాశముండేది. ఇప్పుడా సౌకర్యాన్ని 21 రోజులకు పొడిగించారు. ప్రతి మూడు నెలల్లో ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉండే కాలపరిమితి గతంలోనే 50 రోజులకు పెంచారు. రాష్ట్రాల వసూళ్లు, చెల్లింపులకు మధ్య వ్యత్యాసంలో ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు వేస్ అండ్ మీన్స్ ఉపయోగపడుతుంది. ప్రతి రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్‌లో కనీస నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఆ పరిధిలోనే చెల్లింపులు జరగాలి. ఒకవేళ ప్రభుత్వ ఆదాయం లేకపోతే తొలుత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద మొత్తం వెసులుబాటు వినియోగించుకుంటుంది.


Also read: Rigging in MAA Elections: మా అసోసియేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్, నిలిచిన పోలింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook