జమ్మూ ప్రాంతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ మునీర్‌ ఖాన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితులు అదుపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే  కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు ఆంక్షలు యథాతథ స్థితిని కొనసాగిస్తామన్నారు.  సామాన్య ప్రజలకు హాని కలకూడదనే ఉద్దేశంతోనే తాము ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పరిస్థితులు అంచనా వేసి కశ్మీల్ లో కూడా ఆంక్షలు ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంక్షలు విధింపు..


జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆ ప్రాంతంలో అల్లరు చెలరేగుతాయనే కారణంతో ఆ ప్రాంతంలో గత కొన్ని క్రితం అక్కడ ఆంక్షలు విధించారు. ఉత్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. వేర్పాటువాద నాయకులతో పాటు స్థానిక రాజకీయ నేతలను సైతం  అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా భారీ ప్రదర్శనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు.  దీంతో పాటు ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.


సుప్రీం ఆదేశాలతో...


జమ్మూకశ్మీర్ ప్రాంతంలో కేంద్రం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. దశలవారీగా ఆంక్షల్ని సడలిస్తామని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో జమ్మూలో ఆంక్షలు తొలగించిన కేంద్రం ..కశ్మీర్ ప్రాంతంలో పరిస్థితులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.