Income Tax Notices: దేశంలో విద్యుత్ శాఖ లీలలే కాదు..ఇన్‌కంటాక్స్ శాఖ చేసే విన్యాసాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఒళ్లు హూనం చేసుకుని కష్టపడినా రోజుకు 5 వందలు సంపాదించడం గగనం. మరి ఆ వ్యక్తికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులంటే ఆశ్చర్యంగా ఉందా..నిజమే. చదవండి ఈ వివరాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ శాఖ చేసే విన్యాసాలు ఇప్పటి వరకూ చూశాం. సామాన్యులకు అది కూడా ఒక లైట్ లేదా ఒక ఫ్యాన్ ఉన్నవారికి లక్షల్లో ఒక్కోసారి కోట్లలో బిల్లు చెల్లించమని పంపించడం..సదరు వ్యక్తులు షాక్‌కు గురవడం వంటి సంఘటనలు చాలానే చూశాం. మరి ఈసారి ఇన్‌కంటాక్స్ శాఖ(Income Tax Department)లీలలు చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఇది. 


అతడో సాధారణ రిక్షా కార్మికుడు. రోజూ ఒళ్లు హూనం చేసుకుని కష్టపడినా 5 వందల రూపాయలకు మించి సంపాదించలేని పరిస్థితి. అటువంటి వ్యక్తికి ఆదాయపుపన్ను శాఖ 3 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. అది చూసి ఆ రిక్షా కార్మికుడు షాక్‌కు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ అధికారులు పాన్‌కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్‌కార్డుకై దరఖాస్తు చేశాడు. కొన్నిరోజుల తరువాత పాన్‌కార్డు కలర్ కాపీని జన్‌సువిధ కేంద్రంలోని వ్యక్తి అందించాడు. ఆ తరువాత అక్టోబర్ 19వ తేదీన ఐటీ అధికారుల్నించి ఆ రిక్షా కార్మికునికి ఫోన్ వచ్చింది. 3 కోట్ల 47 లక్షల 54 వేల 896 రూపాయలు చెల్లించాలని నోటీసులిచ్చారు. ఇదీ జరిగిన కధ. ఇదే సంగతి ఐటీ అధికారులకు వివరించాడు. 


అసలు జరిగిందేంటంటే ఎవరో ఇతడి పాన్‌కార్డు(Pancard)ఉపయోగించుకుని వ్యాపారం నడిపారు. 2018-19లో జరిగిన టర్నోవర్ 43 కోట్ల 44 లక్షల 36 వేల 201 రూపాయలుగా ఐటీ అధికారులు తేల్చారు. ఆ రిక్షా కార్మికుడు (Rickshaw puller gets notice from it department)నిరక్ష్యరాస్యుడు కావడంతో ఒరిజినల్ పాన్‌కార్డుకు, కలర్ కాపీకు తేడా గ్రహించలేకపోయాడు.మోసానికి గురయ్యాడు. అసలు విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆ రిక్షా కార్మికుడి పాన్‌కార్డు దుర్వినియోగమైందని గ్రహించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెబితే..మధుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  


Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook