MLA compares roads with Kangana Ranaut Cheeks: జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.ఇర్ఫాన్ అన్సారీ (MLA Dr.Irfan Ansari) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలోని రోడ్లను కంగనా రనౌత్ (Kangana Ranaut) బుగ్గలతో పోలుస్తూ అన్సారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అన్సారీ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జమతారాలో 14 వరల్డ్ క్లాస్ రోడ్ల  నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. ఆ రోడ్లు హీరోయిన్ కంగనా రనౌత్ బుగ్గల కంటే స్మూత్‌గా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను.' అని ఆ వీడియోలో ఎమ్మెల్యే డా.ఇర్ఫాన్ అన్సారీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్సారీ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా... నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. బాధ్యాతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు చీప్ పబ్లిసిటీ స్టంట్ అని ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు.


ఎమ్మెల్యే డా.ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. కరోనా మాస్కులు ధరించడంపై కూడా ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా మాస్కులు ఎక్కువసేపు ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదని కామెంట్ చేశారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌గా తాను ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. కేవలం జనంలోకి వెళ్లినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలన్నారు.


కాగా, రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోలుస్తూ గతంలోనూ పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ గులాబ్‌ రావ్ పాటిల్ ఇటీవల తన నియోజకవర్గంలోని రోడ్లను నటి హేమ మాలిని బుగ్గులతో పోల్చారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు. గతేడాది నవంబర్‌లో రాజస్తాన్ మంత్రి రాజేంద్ర సింగ్.. రాష్ట్రంలోని రోడ్లను హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) బుగ్గలతో పోల్చారు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను నటి హేమ మాలిని బుగ్గలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.



Also Read: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook