గ్రూప్-డి రాతపరీక్షలకు సంబంధించిన రైల్వే బోర్డు మరో ప్రకటన చేసింది. అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 17 వరకు జరిగే రైల్వే గ్రూప్-డి పరీక్ష తేదీ, సెంటర్, షిఫ్ట్ వివరాలను రైల్వే శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది. రిజిస్ట్రేషన్ నెంబరు మరిచిపోయినవారు కింది లింక్‌లో పుట్టినతేదీ, ఈమెయిల్ ఐడీ వివరాలు ఇవ్వడం ద్వారా తిరిగి పొందవచ్చంది. క్రితంసారి లాగే అభ్యర్థుల పరీక్ష తేదీకి నాలుగురోజుల ముందు నుంచి మాత్రమే అడ్మిట్ కార్డులను రైల్వేబోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతామంది.


దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్ల పరిధిలో 64వేల గ్రూప్ డి పోస్టులకు సుమారు కోటి 90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


అభ్యర్థుల తమ పరిధిలోని రైల్వే జోన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో హాల్ టిక్కెట్‌ను, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లను చూపించాలి. జిరాక్సు కాపీలను అనుమతించరు. ఇక ఎస్సీ, ఎస్టీలకు రైల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుంది.


అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా...


  • indianrailways.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • వెబ్‌సైట్‌లో Recruitment అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • రీజియన్ల వారీగా రైల్వే నియామక బోర్డులు కనిపిస్తాయి. అభ్యర్థులు తమ రీజియన్ ఎంపిక చేసుకోవాలి.

  • అప్పుడు సంబంధిత రీజియన్ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అక్కడ 'e-call letter download' అనే ఆప్షన్‌ లింక్‌పై క్లిక్ చేయాలి.

  • అభ్యర్థులు తమ దరఖాస్తు రిజిస్ట్రేషన్ సంఖ్య, పుట్టిన తేది నమోదు చేసిన వెంటనే కాల్ లెటర్  కనిపిస్తుంది. కాల్‌లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.