Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం.. జనవరి 26 నుండి అమల్లోకి..
Good News: ద్విచక్రవాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటరు పెట్రోల్‌పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Jharkhand Petrol Price: ద్విచక్రవాహనదారులకు గుడ్ న్యూస్. జార్ఖండ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ప్రకటించారు. మోటార్‌సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ (Petrol discount) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రో ధరల తగ్గింపు పేదలకు లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
జార్ఖండ్‌లోని తన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం హేమంత్ సొరేన్ ఈ ప్రకటన చేశారు. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. గరిష్టంగా 10 లీటర్ల వరకు ఈ రాయితీ పొందవచ్చు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రేటు (Petrol Rates) దాదాపు వంద రూపాయలుగా ఉంది. ఓ పక్క ఒమిక్రాన్ తో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఇటువంటి సమయంలో జార్ఖండ్ ప్రభుత్వం (Jharkhand Govt) తీసుకున్న నిర్ణయం సాహసమనే చెప్పాలి. పెట్రో ధరల భారంతో విలవిల్లాడుతున్న వాహదారులకు ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం.
Also Read: Auto Rides: కొత్త సంవత్సరంలో ఆటో రైడ్స్‌పై జీఎస్టీ.. సామాన్యులపై మరో భారం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook