Auto Rides: కొత్త సంవత్సరంలో ఆటో రైడ్స్‌పై జీఎస్టీ.. సామాన్యులపై మరో భారం...

GST on online auto ride bookings:నూతన సంవత్సరంలో యాప్ ఆధారిత ఆటో రైడ్ సేవల ఛార్జీలు పెరగనున్నాయి. ఓలా, ఉబర్ తదితర ఆన్‌లైన్‌తో లింక్ అయి ఉన్న ఆటో సేవలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 10:01 AM IST
  • ఆన్‌లైన్ ఆటో బుకింగ్స్‌పై 5 శాతం జీఎస్టీ
  • కొత్త సంవత్సరంలో జనవరి 5 నుంచి అమలు
  • సామాన్యులకు భారం కానున్న ఆటో ప్రయాణం
Auto Rides: కొత్త సంవత్సరంలో ఆటో రైడ్స్‌పై జీఎస్టీ.. సామాన్యులపై మరో భారం...

GST on online auto ride bookings: నూతన సంవత్సరంలో యాప్ ఆధారిత ఆటో రైడ్ సేవల ఛార్జీలు పెరగనున్నాయి. ఓలా, ఉబర్ (Ola, Uber auto bookings) తదితర ఆన్‌లైన్‌తో లింక్ అయి ఉన్న ఆటో సేవలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. దీంతో సామాన్యులపై మరింత భారం తప్పేలా లేదు. ఈ నిర్ణయాన్ని ఆటో డ్రైవర్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా నష్టపోయామని... జీఎస్టీ కారణంగా ప్రజలు ఆటో రైడ్స్ వైపు మొగ్గుచూపరని వాపోతున్నారు.

ఆటో రైడ్‌పై జీఎస్టీ కారణంగా... సాధారణ ఛార్జీలకు తోడు 5 శాతం జీఎస్టీని (Goods and Service Tax) ప్రయాణికుల నుంచి వసూలు చేస్తారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఆటో డ్రైవర్స్ సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి వ్యతిరేకించారు. ఆయన మాట్లాడుతూ... 'ఇప్పటికే కరోనా కారణంగా చాలా నష్టపోయాం. ఆటోల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు.

యాప్ ఆధారిత సేవలతో ఇంటి నుంచే ఆటో రైడ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఆ సేవలను ఉపయోగించుకుంటున్నారు. పైగా రెగ్యులర్ క్యాబ్స్‌తో పోలిస్తే ఆటో రైడ్స్‌కి అయ్యే ఛార్జీ తక్కువ. కానీ కేంద్రం విధించబోతున్న జీఎస్టీ కారణంగా ప్రజలు యాప్ ఆధారిత ఆటో సేవల వైపు అంతగా మొగ్గచూపకపోవచ్చు. యాప్స్ లేదా ఏ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా రోడ్లపై తిరిగే ఆటోల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. 

ఆటో రైడ్స్‌పై జీఎస్టీ కారణంగా కేంద్రానికి ఆదాయం పెరుగుతుందేమో కానీ తమ ఆదాయం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆటో డ్రైవర్స్ వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ఈ పాలసీ అమలైతే యాప్ ఆధారిత ఆటో రైడ్ సేవలందించే కంపెనీలు ప్రతీ ట్రిప్‌కు సంబంధించిన రెవెన్యూ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: MP Kesava Rao: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News