ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఒకటి 'లవ్ జిహాద్'కు కౌంటర్ గా 'బేటీ బచావో బహూ లావో' అనే సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. వచ్చేవారమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆ సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమం క్రింద వచ్చే ఆరునెలల్లో హిందూ యువకులు 2,100 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకుంటారని.. వారికి రక్షణ, భద్రత, సామాజిక మద్దతు కల్పిస్తామని ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ మతం ప్రకారం వివాహం జరుగుతుందని.. ముస్లిం యువతులు తమ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఇది కూడా లవ్ జిహాద్ తరహాలాంటిదేనని హిందూ జాగరణ్ మంచ్ (హెచ్ జే ఎమ్) రాష్ట్ర అధ్యక్షుడు అజ్జు చౌహాన్ చెప్పారు. 


లవ్ జిహాద్ లో హిందూ యువతులే లక్ష్యంగా ముస్లిం యువకులు ప్రేమిస్తున్నారు. హిందూ యువతులను ప్రేమలో పడేయటానికి హనుమాన్ చాలీసా కంఠస్థం పడతారు.. నుదుట తిలకం పెట్టుకుంటారు. తీరా పెళ్ళయ్యాక తాను ముస్లిం యువకుడ్ని అని.. నువ్వు కూడా మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. వారిని ఉగ్రవాదులుగా, మానవబాంబులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనులు నిజమైన ముస్లిం యువకులు చేయరని అన్నారు. 


పైగా ముస్లిం కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగితే, ముస్లిం మహిళ 10 మంది పిల్లలకు జన్మనివ్వాలి. పిల్లలు పెద్దయ్యాక వారు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. అదే ఒక హిందూ యువకుడిని పెళ్లి చేసుకుంటే అంత మంది పిల్లలకు జన్మనిచ్చే బాధ తగ్గుతుంది. పైగా హిందూ జనాభాకు సహకరించినట్లవుతుంది. ఈ కార్యక్రమం తమకు లాభించే అంశమని అన్నారు హిందు జాగరణ్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్జు చౌహాన్.