సచిన్ పైలట్ ( Sachin Pilot ) . ఇప్పుడీ పేరు చుట్టే మొత్తం  రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.  రాజస్థాన్ ప్రభుత్వం ( Rajasthan Government ) సంక్షోభం వైపుకు వెళ్తుండటానికి కారణం ఈ పేరే. రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్సెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్  వివాదానికి కారణమేంటి ? సచిన్ పైలట్ నేపధ్యమేంటి ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా అందుకున్న సచిన్ పైలట్ ముందు నుంచీ కాంగ్రెస్ వాదినే. అంతకుమించి గాంధీ నెహ్రూ కుటుంబానికి పైలట్ కుటుంబం అండగా ఉండటం మరో అర్హత. తండ్రి రాజేశ్ పైలట్ ( Rajesh pilot ) రాజీవ్ గాంధీ ( Rajiv Gandhi ) కు సన్నిహితంగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం తనయుడు సచిన్ పైలట్ రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కు అత్యంత సన్నిహితుడిగా మారారు. రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ గాంధీ ఎక్కువగా సచిన్ పైలట్ పైనే ఆధారపడేవారు. Also read: Rajasthan కాంగ్రెస్‌‌కు పూర్తి మెజార్టీ ఉంది: రణ్‌దీప్ సుర్జేవాలా 


2004లో దౌసా ( Dausa ) లోక్ సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైనప్పుడు యంగెస్ట్ పార్లమెంంటేరియన్ గా ఖ్యాతినార్జించారు. అనంతరం 2009లో అజ్మీర్ ( Ajmer ) నుంచి ఎన్నికయ్యారు. తరువాత 2014 ఎన్నికల్లో మాత్రం ఇదే స్థానం నుంచి ఓడిపోయారు. 2018 రాజస్థాన్  అసెంబ్లీ ఎన్నికల్లో ( Rajasthan Assembly Elections )  టోంక్ అసెంబ్లీ ( Tonk Assembly ) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. Also read: Rajasthan: సంక్షోభంలో గెహ్లాట్ ప్రభుత్వం


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో పార్టీ విజయానికి సచిన్ పైలట్ కీలకపాత్ర పోషించారని ప్రచారం ఊపందుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేసులో ( CM Race ) నిలిచారు. అయితే  పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) పోటీగా మారారు. సోనియా గాంధీ ( Sonia Gandhi )...అశోక్ గెహ్లాట్ వైపు నిలిస్తే...రాహుల్ గాంధీ మాత్రం సచిన్ పైలట్ వైపు నిలిచారు. ముఖ్యమంత్రిగా సీనియర్ ఉండాలనే సోనియా గాంధీ అభిప్రాయంతో చివరికి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ( CM Ashok Gehlot ) ప్రమాణ స్వీకారం చేయగా..సచిన్ పైలట్ డిప్యూటీ ముఖ్యమంత్రి ( Sachin pilot as Deputy cm ) బాధ్యతల్ని స్వీకరించారు. అప్పట్నించి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య వివాదం రగులుతూనే ఉంది. Also read: Sharad Pawar: పాక్ కాదు..చైనానే అసలు శత్రువు


ఇటీవలి కాలంలో పైలట్ సొంతగూడు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అప్రమత్తమయ్యారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ( Special Operation Group ) తరపున సచిన్ పైలట్ కు నోటీసులు జారీ అయ్యాయి. డిప్యూటీ సీఎంకు నోటీసులు పంపించడంపై వివాదం తారాస్థాయికి చేరుకుంది. సచిన్ ఆగ్రహం అందలమెక్కింది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో వేరుకుంపటి ప్రయత్నాలు ప్రారంభించారు. 30 మంది ఎమ్మెల్యేలు తనవెంట ఉన్నారంటూ సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేశారు. 109 మంది ఎమ్మెల్యేల బలం తనకే ఉందంటూ సీఎం అశోక్ గెహ్లాట్ వాదిస్తున్నారు. 


2 వందల మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో ( Rajasthan Assembly ) కాంగ్రెస్ పార్టీకు 107 మంది, బీజేపీకు 72 మంది ఎమ్మెల్యేలున్నారు. 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే..లోక్ తాంత్రిక్ పార్టీ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపున్నారు. 


ఈ నేపధ్యంలో సచిన్ పైలట్ శాంతించకపోతే రాజస్థాన్ ప్రభుత్వం నిలబడటం కష్టసాధ్యంగా మారుతుంది. మధ్యప్రదేశ్ పరిస్థితులు పునరావృతం కానున్నాయనే వార్తలు వస్తున్నాయి. అందుకే పరిస్థితిని నియంత్రించడానికి కాంగ్రెస్ అధిష్టానం రంగంలో దిగింది. Also read: West Bengal: బీజేపీ ఎమ్మెల్యే మరణంపై రేగుతున్న అనుమానాలు