Sanatana Dharma Amid Row: సనాతన ధర్మంపై ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం సృష్టించాయి. హిందూ సంఘాలతో పాటు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు చేస్తోంది. ఈ వివాదం ముగియక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో వివాదానికి తెరలేపారు. కేరళ రాష్ట్రంలోని ఓ హిందూ దేవాలయంతో తనకున్న అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. సామాజిక సంఘ సంస్కర్త నారాయణ గురు 169వ జయంతి సందర్భంగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలోని ఓ హిందూ దేవాలయంలోకి ప్రవేశించే ముందు తనను చొక్కా విప్పమని ఆడిగారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తాజాగా వ్యాఖ్యనించారు. దీంతో ఆ ఆలయంలోకి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. "ఒకసారి నేను కేరళ వెళ్లాను. అక్కడున్న ఓ ఆలయానికి వెళ్తే.. చొక్కా తీసేసి దర్శనానికి వెళ్లమన్నారు. దానికి నేను నిరాకరించి.. వెంటనే బయట నుంచే దేవుడికి ప్రార్ధించి వచ్చేశాను" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. 


కొంతమందికే ఆ సౌలభ్యం..


అయితే దేవాలయానికి వచ్చిన అందర్ని చొక్కా విప్పమని చెప్పలేదని.. కొందర్ని మాత్రమే అలా ఆదేశించారుని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇది తనకు ఎదురైన అమానవీయమైన చర్యని అని ఆయన తెలిపారు. దేవుని ముందు అందరం సమానమే అని అతను స్పష్టం చేశారు. 


Also Read: Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి  


దక్షిణ భారతంలో ఇదే ఆచారం!!
ఈ క్రమంలో హిందూ సంప్రదాయల గురించి చర్చ కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశానికి హిందువులు కొన్ని ఆచారాలను పాటిస్తారు. దేవుని దర్శనానికి వెళ్లే భక్తులలో పురుషులు చొక్కాలు తీసేసి, భుజాలపై అంగవస్త్రంతో దేవాలయాలనికి వెళ్లే ఆచారం కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఈ ఆచారాలపై కర్ణాటక సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేయడం వల్ల పలు విమర్శలకు తావిస్తోంది. 


'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి'
అంతకుముందు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఇలాంటి ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదాలను రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు కూడా ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.


Also Read: Xiaomi S3 Watch Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi S3 వాచ్‌..లీకైన ఫీచర్స్‌ ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook