Sankranti Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు, ఎక్కడెక్కడంటే
Sankranti Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణీకుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను నడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Special Trains: సంక్రాంతి తెలుగు వారికి అతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఏపీ ప్రజలకు అతి పెద్ద పండుగ. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణీకుల తాకిడి పెరుగుతుంది. బస్సులు, రైళ్లు నిండిపోతుంటాయి. ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
దక్షిణ మధ్య రైల్వే జనవరి 10 నుంచి 15 వరకూ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరో ఆరు ప్రత్యేక రైళ్లు నడపనుంది. జనవరి 10వ తేదీన ట్రైన్ నెంబర్ 07055 తిరుపతి-సికింద్రాబాద్, జనవరి 11వ తేదీన ట్రైన్ నెంబర్ 07056 సికింద్రాబాద్-తిరుపతి, జనవరి 12న ట్రైన్ నెంబర్ 07057 కాకినాడ-సికింద్రాబాద్, జనవరి 13న ట్రైన్ నెంబర్ 07071 సికింద్రాబాద్-కాకినాడ, జనవరి 14వ తేదీన ట్రైన్ నెంబర్ 07072 కాకినాడ-తిరుపతి, జనవరి 15వ తేదీన ట్రైన్ నెంబర్ 02707 తిరుపతి-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి.
తిరుపతి సికింద్రాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు జనవరి 10వ తేదీ ఉద.యం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, కర్నూలు, గద్వాల, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఇక జనవరి 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్లే మరో రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఇక కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య మరో రైలు నడవనుంది. జనవరి 11న ఈ ప్రత్యేక రైలు ఉంటుంది. కొన్ని రైళ్లను ఏలూరు మెయిన్ లైన్ మీదుగా, మరి కొన్ని రైళ్లను తణుకు, భీమవరం లైన్ మీదుగా నడపనుంది దక్షిణ మధ్య రైల్వే.
Also read: CA Results 2023: ఐసీఏఐ సీఏ, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook