Tamil nadu: అవినీతి ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి విడుదలైన తమిళ చిన్నమ్మ శశికళ కొత్త వ్యూహం పన్నుతున్నారు. ఆరేళ్ల నిషేధాన్ని తొలగించుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా..లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళనాడు ( Tamil nadu ) రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న చిన్నమ్మ అలియాస్ శశికళ( Sasikala ) కొత్త ఎత్తుగడకు సిద్ధమవుతున్నారు. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం ఇటీవలే ఆమె విడుదలయ్యారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ( Tamil nadu Assembly Elections ) కు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటే..ఆరేళ్ల నిషేధం ( Six years Ban ) అడ్డొస్తుంది. 1988 అవినీతి చట్టం ప్రకారం ఆరేళ్ల పాటు ఆమె పోటీకు అనర్హురాలు. మరి ఈ సమస్యను అధిగమించేందుకు సిక్కిం రాజకీయాల్లో జరిగిన ఘటనను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే న్యాయకోవిదులతో ఆ దిశగా చర్చలు ప్రారంభించారు. 


సిక్కింలో ఏం జరిగింది


సిక్కిం ( Sikkim )రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్‌సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్ల పాటు పోటీకి అనర్హమని చట్టనిపుణులు చెప్పినా సరే..2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం నిషేధాన్ని ఎత్తివేయాలని ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమీషన్ ఆయన విజ్ఞప్తిని ఆమోదించింది. ఇప్పుడు సిక్కింలానే..శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చిస్తున్నారు. 


Also read: Funny tweet: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook