SBI Deposit scheme: వినియోగదారులకు ఎస్బీఐ శుభవార్త, ఆ స్కీమ్ గడువు మళ్లీ పెరిగింది
SBI Deposit scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు శుభవార్త. వృద్ధులకోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది ఎస్బీఐ.
SBI Deposit scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు శుభవార్త. వృద్ధులకోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది ఎస్బీఐ.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State bank of india) 2020 మే నెలలో కరోనా వైరస్ (Coronavirus)సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఎస్‌బీఐ వీ కేర్ స్కీమ్ (SBI Wecare scheme) ప్రవేశపెట్టింది. ఇప్పుడీ స్కీమ్‌కు సంబంధించి శుభవార్త అందిస్తోంది. వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఈ స్కీమ్ గడువును జూన్ 30 వరకూ పొడగించింది. ముందు 2020 సెప్టెంబర్ వరకూ గడువు విధించిన ఎస్బీఐ తరువాత డిసెంబర్ వరకూ పొడిగించింది. ఆ తరువాత మార్చ్ 2021 వరకూ పొడిగించింది. ఇప్పుడు మరోసారి జూన్ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సీనియర్ సిటిజన్లు ఎస్‌బీఐ వీ కేర్ స్కీమ్‌లో డిపాజిట్ చేసేందుకు ఇంకా 3 నెలల సమయముంది. ఎస్‌బీఐ వీ కేర్ అనేది ఓ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్( Fixed Deposit scheme). ఇందులో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కంటే వృద్ధులకు 80 బేసికి పాయింట్లు అంటే 0.8 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 5.40 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీరేటు అందిస్తుంది.
ఎస్‌బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీమ్ ( SBI Wecare deposit scheme) లో చేరాలంటే 60 ఏళ్ల వయస్సు పైబడి ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అక్కౌంట్ లేదా జాయింట్ అక్కౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. నామినేషన్ సదుపాయముంటుంది. ఈ స్కీమ్‌లో కనీసం వేయి రూపాయల నుంచి గరిష్టంగా 15 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ముందు ఐదేళ్ల కోసం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత మరో మూడేళ్లు పొడిగించవచ్చు. ఐదేళ్ల కంటే ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ నష్టపోవల్సి వస్తుంది. ఈ స్కీమ్‌పై ఎటువంటి ఆదాయపు పన్ను మినహాయింపు ఉండదనేది గుర్తుంచుకోవాలి.
Also read: Corona second wave: కరోనా సెకండ్ వేవ్ టార్గెట్ గ్రూప్ ఆ వయస్సువారేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook