SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ ఉద్యోగం పొందడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్,సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర పోస్టులకు నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించడం ద్వారా SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దరఖాస్తుకు చివరి తేదీ:
అభ్యర్థులు 2024 మార్చి 4 వరకు SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఇదీ చదవండి: UPSC Exam 2024: UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. 1056 ఖాళీల భర్తీ..


SBI రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 131 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్) 23 పోస్టులు,
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ ) 51,
మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ ) 3,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ) 3 పోస్టులు, 
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1 పోస్టులు 
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 50 పోస్ట్‌లను భర్తీ చేయనుంది.


ఇదీ చదవండి: సుప్రీంకోర్టు సంచలనతీర్పు.. ఎలక్టోరల్ బాండ్స్ తక్షణ నిషేధం..


వయో పరిమితి: 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయోపరిమితి గురించి తెలుసుకోవడానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.


అర్హత..
మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు MBA (ఫైనాన్స్)/PGDBA/PGDBM/MMS (ఫైనాన్స్)/CA/CFA/ ICWA ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి