UPSC Exam 2024: UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. 1056 ఖాళీల భర్తీ..

UPSC Civil Services Exam 2024: దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 14, 2024, 03:37 PM IST
UPSC Exam 2024: UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. 1056 ఖాళీల భర్తీ..

UPSC Civil Services Exam 2024: దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎగ్జామ్ కు నోటిఫికేషన్ ను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. చివరితేదీ మార్చి 5 వరకు దరఖాస్తు గడువు ఉంది.

ఇదీ చదవండి: భక్తులకు 6 షిఫ్టుల్లో బాలరాముని దర్శనం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పాసులు..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వేలల్లో పరీక్ష రాస్తే కొందరు మాత్రమే క్వాలిఫై అవుతారు.  ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in, upsc.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష 26న నిర్వహించగా.. మెయిన్స్ అక్టోబర్ 19 న జరగనుంది.

ఇదీ చదవండి: ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  సివిల్స్ సర్వీస్ ఎగ్జామ్(CSE) పరీక్షను 2024 మే 26న నిర్వహించనున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 05. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News