SBI PO Notification Out: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 600 పోస్టుల భర్తీకి, పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థులు కలిగి ఉండాల్సిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 డిసెంబర్ 27 నుంచి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్. ఇక 2025 జనవరి 16వ తేదీ అప్లికేషన్ తీసుకోవటం క్లోజ్ అయిపోతుంది. ఎగ్జామ్ కి సంబంధించిన కాల్ లెటర్ 2025 ఫిబ్రవరి 4 వారంలో విడుదల చేయవచ్చు. ఇక ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్చి 8, 15 తేదీల్లో నిర్వహిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోస్టుల ఈ నోటిఫికేషన్ ద్వారా 586 రెగ్యులర్ పోస్టులను మిగతా 14 పోస్టు బ్యాక్లాగ్ వేకెన్సీలను భర్తీ చేయనుంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ (SBI PO) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టుల దరఖాస్తుకు అర్హులు.ఎస్‌బీఐ పీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 21 ఏళ్ల కంటే తక్కువ 30 ఏళ్లు పైబడి ఉండకూడదు.


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా పరీక్షలు నిర్వహిస్తుంది. ఫేజ్‌ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది... ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా అర్హత సాధించిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.


ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్‌ ఉంటాయి. ఇది ఆన్లైన్లో నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందులో కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్‌ ఉంటాయి. ఇది 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇది కాకుండా డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు... సైకోమెట్రిక్ టెస్ట్ లో పర్సనాలిటీ ప్రొఫైలింగ్ ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఓబిసి, పీడబ్ల్యూసి అండ్ అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.750 రూపాయలు ఫీజు చెల్లించాలి.


ఇదీ చదవండి: ఖాతాదారులకు అలెర్ట్.. బ్యాంకులకు కొత్త టైమింగ్స్‌, జనవరి 1వ తేదీ నుంచే అమలు..!  


 ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఈ ఫీజు ని కూడా రిఫండ్ చేయరు. ఎస్బిఐ పేజీలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరగా ఫీజు చెల్లించాలి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే తర్వాత అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్‌ రిలాక్సేషన్ ఉందా? లేదా? అనే స్పష్టత కావాలి అంటే కూడా అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌ చదవండి. ఎంపికైనా అభ్యర్థులకు ఏడాదికి రూ.18 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుందని అంచనా.


ఇదీ చదవండి: నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. రిలేషన్‌, రొమాన్స్‌ అంటే ఇష్టం..! ప్రభాస్ భామ బోల్డ్ కామెంట్స్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.