Bank Timings: ఖాతాదారులకు అలెర్ట్.. బ్యాంకులకు కొత్త టైమింగ్స్‌, జనవరి 1వ తేదీ నుంచే అమలు..!

Bank Timings Change: కొన్ని ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పుల చేశారు. ఈ కొత్త టైమింగ్స్‌ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానుంది. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /6

బ్యాంకులు ఒక్కో టైమ్‌లో పనిచేస్తున్నాయి. కొన్ని ఉదయం 10:30 ప్రారంభం అవుతే మరికొన్ని 11 గంటలకు ప్రారంభం అవుతాయి. దీంతో పనివేళలు తెలియక కస్టమర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్‌ పెట్టడానికి మధ్యప్రదేశ్‌లోని బ్యాంకర్ల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.  

2 /6

ఇకపై అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పనిచేయాలి. అప్పుడు ఒకే సమయంలో పనులు కూడా సజావుగా సాగుతాయని ఈ మేర నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓపెన్‌ అయితే, సాయంత్రం 4 గంటల వరకు అవి పనిచేయనున్నాయి.  

3 /6

అన్ని బ్యాంకులు ఇలా ఒకే సమయంలో పనిచేయడం వల్ల ఇంటర్‌ బ్యాంక్‌ లావాదేవీల సేవల్లో కూడా సమన్వయం కూడా బాగుంటుందని ఈ మేర నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విధానాన్నే ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయవచ్చు.   

4 /6

ఇక బ్యాంకులకు కేవలం 5 రోజులు పనిదినాలు కూడా త్వరలో అవుతాయని, జనవరి తర్వాత దీనిపై స్పష్టత వస్తోందని వినిపిస్తున్నాయి. ఆ సమయంలో అయితే, బ్యాంకులు 45 నిమిషాల ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది.  

5 /6

ఒకవేళ ఈ నిర్ణయం ఓకే అయితే, బ్యాంకులు అన్ని శని, ఆదివారాలు బంద్‌ ఉంటాయి. కేవలం ఐదు రోజులే పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రతి రెండో, నాలుగో శనివారం, అన్ని ఆదివారాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఎప్పటి నుంచో బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ ఐదు రోజుల పనిదినాలకు ఆర్జి పెట్టుకున్నాయి.  

6 /6

అయితే, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని అధికారికంగా అప్రూవ్‌ చేయాల్సి ఉంది. బ్యాంకు సెలవులు కొన్ని స్థానిక పండుగలు, ప్రత్యేక దినాల సందర్భంగా ఉంటాయి. మరికొన్ని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం అందుబాటులో ఉంటాయి.